Site icon NTV Telugu

Marriage Record: 12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..

Mass Weddings

Mass Weddings

Marriage Record: రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. 12 గంటల్లో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2013లో 24 గంటల్లలో యెమెన్ దేశంలో 963 జంటలు అత్యధిక వివాహాలు చేసుకున్న రికార్డును బద్దలు కొట్టారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ లో హిందూ, ముస్లిం జంటలకు వివాహాలు జరిగాయి. శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇలా సామూహిక వివాహాలు చేస్తోంది.

మే 26న. 2,413 జంటలు వివాహాలు ఒకే ప్రదేశంలో జరిగాయి. ప్రతీ ఒక్కరు కూడా ఆరు గంటలతోపు వివాహం చేసుకున్నారు. ముందుగానే వధూవరులు పూలదండలు మార్చుకుని పెళ్లి మండపానికి చేరుకున్నారు. ప్రతీ జంట వివాహాన్ని వారి మతానికి అనుగుణంగా పూజారుల చేత నిర్వహించారు. హిందూ పూజారులు గాయత్రీ పరివార్ నుండి వచ్చారు, అదే సమయంలో ముస్లిం క్వాజీలు సమీప ప్రాంతాల నుంచి వచ్చినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది. వివాహ తతంగం ముగిసిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రాలను అందించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేబినెట్ మంత్రి ప్రమోద్ జైన్ భయా ప్రతి జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి జంటకు వధువు కోసం ఆభరణాలు, పరుపులు, వంటగది పాత్రలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, కూలర్, ఇండక్షన్ కుక్కర్ వంటి గృహోపకరణాలు వంటి బహుమతులు కూడా అందించబడ్డాయి. వివాహానికి హాజరైన అతిథులకు, మిగతావారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్సైట్ పేర్కొంది.

Exit mobile version