NTV Telugu Site icon

Jammu Kashmir: కాశ్మీర్‌లో మరో 2000 మంది బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు..

Terror Attacks, Bsf

Terror Attacks, Bsf

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడం, సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువ కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్తాన్ వెంబడి భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి సిబ్బందిని మోహరించనున్నారు.దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలను తరలించనున్నారు.

Read Also: Gaganyaan Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ తొలి వ్యోమగామి..ఎప్పుడంటే..?

బీఎస్ఎఫ్‌కి చెందిన రెండు బెటాలియన్లు తొలుత జమ్మూ కాశ్మీర్ రియాసి, కిష్టవార్, కథువాకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల తర్వాత 2000 మంది సైనికులతో కూడిన మరో రెండు బెటాలియన్లను జమ్మూలో మోహరించనున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గత కొన్ని రోజలుగా ఉగ్రదాడులు ఎక్కువైన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తో్ంది.

శనివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) జరిపిన దాడిని భారత సైన్యం అడ్డుకుంది. ఈ పోరులో ఒక భారతీయ సైనికుడు మరణించగా, మరో నలుగురు కూడా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్‌కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యారు. పాక్ బీఏటీ దళంలో పాక్ సైనికులు, ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో జిల్లాలోని కమ్కారి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అంతకుముందు జూలై 24న కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. ఈ పోరులో ఓ జవాన్ అమరుడయ్యాడు.