NTV Telugu Site icon

Dense Fog: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు..

Fog

Fog

Dense Fog: ఉత్తర భాతరదేశాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు విమానాలు రద్దు కాగా, మరిన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, ఈరోజు (జనవరి 5) ఉదయం 4 నుంచి 8 గంటల వరకు జీరో విజిబిలిటీ నమోదు అయింది. ఆ తర్వాత విజిబిలిటీ 50 మీటర్లకు మెరుగుపడటంతో.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆదివారం 6 విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. అలానే, మరో 123 విమానాలు సగటున 20 నిమిషాల ఆలస్యంగా ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అలాగే, 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 59 రైళ్లు ఆరు గంటల ఆలస్యంతో, 22 రైళ్లు ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం కొనసాగిస్తున్నాయని ఉత్తర రైల్వే డిపార్ట్మెంట్ తెలిపింది.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

కాగా, ఢిల్లీలో 10 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 377గా రికార్డు అయింది. చలిగాలులు వీచే ఛాన్స్ ఉందని, దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు, శనివారం నాడు దాదాపు తొమ్మిది గంటల వరకు జీరో విజిబిలిటీ నమోదు అయింది. దీంతో శనివారం కూడా 48 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. 564 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 15 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Show comments