Site icon NTV Telugu

Heavy Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. నిలిచిపోయిన 100కి పైగా విమానాలు, జలమయమైన నగరం!

Delhi

Delhi

Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే, ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఢిల్లీ‌కి రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Read Also: Mani Ratnam : సినిమా.. ఒక వ్యాపారం అయిపోయింది

అయితే, మరోవైపు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా సుమారు 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇక, ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు ఆథారిటీ కోరింది.

Read Also: NDA CMs Meeting: నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

కాగా, ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాలలో 5 నుంచి 8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది అని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా.. గంటకు 60 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Read Also: Naga Vamsi : నాగవంశీ షాకింగ్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి..?

ఇక, ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో తెల్లవారుజాము వరకు నమోదైన వర్షపాతం కొలతలు:
సఫ్దర్‌జంగ్: 81 మిల్లి మీటర్ల వర్షపాతం.
పాలం: 68 మిల్లి మీటర్ల వర్షపాతం.
పూసా: 71 మిల్లి మీటర్ల వర్షపాతం.
మయూర్ విహార్: 48 మిల్లి మీటర్ల వర్షపాతం.

Exit mobile version