McDonald: ప్రముఖ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ తనకు రూ. 2 కోట్లు చెల్లించాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే చికెన్ బర్గర్ కోసం బిల్ చేసిన తర్వాత తనకు మానసిక క్షోభ కలిగిందని ఆరోపిస్తూ బెంగళూర్‌కి చెందిన కస్టమర్ దావా వేశారు. శాఖహారి అయిన వ్యక్తికి చికెన్ బర్గర్ ఇవ్వడంపై ఈ వివాదం నెలకొంది.
33 ఏళ్ల బెంగళూర్‌లోని ఉల్సూర్ నివాసి, రెస్టారెంట్ బిల్లింగ్ సమయంలో సమస్య ఏర్పడి వేరే ఆర్డర్ అతడికి వెళ్లింది. తాను శాకాహారినని, తాను ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌కి బదులుగా చికెన్ బర్గర్‌కి బిల్ చేయడంపై ‘‘మానసిక బాధ’’ అనుభవించానని, తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని దావా వేశాడు. లిడో మాల్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో ఈ సంఘటన జరిగింది.
Read Also: Minister Uttam Kumar Reddy: పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం..
ఫిర్యాదుదారు, అతడి మేనల్లుడు వెజ్ ఐటెమ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాడు. అయితే, బిల్లులో పొరపాటున మెక్‌ఫ్రైడ్ చికెన్ బర్గర్ వచ్చింది. లోపాన్ని గమనించిన తర్వాత కస్టమర్‌కి రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది. అసౌకర్యానికి పరిహారంగా రూ. 100 అందించారు. దీంతో సంతృప్తి చెందన సదరు వ్యక్తి తనకు మెక్డొనాల్డ్స్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఫిర్యాదుతో పాటు బెంగళూరు అర్బన్ II అదనపు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌లో కేసు నమోదు చేయబడింది.
తన ఫిర్యాదులో ఆ వ్యక్తి రెస్టారెంట్ సర్వీస్ లోపం గురించి ఆరోపించారు. భారీ మొత్తాన్ని పరిహారంగా కోరాడు. మెక్‌డొనాల్డ్ పొరపాటు అనుకోకుండా జరిగిందని వాదించింది. వెంటనే సరిదిద్దామని, క్షమాపణ, ఆర్డర్ వాపస్ పెట్టామని చెప్పారు. ఇది పనికిమాలిన కేసు అని, పరిహారం పొందేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత.. కస్టమర్ తన శాకాహార ఆర్డర్ అందుకున్నాడని, బిల్లింగ్ లోపంతో అతడి ఆహారం తారుమారైందని, ఇది అతడి ఆహార ప్రాధాన్యతని దెబ్బతీయలేదని, ఇది సేవాలోపం, చిన్న పొరపాటుగా జరిగిందని, కోట్ల పరిహారం డిమాండ్ చేయడం సమర్థనీయం కాదని తీర్పు చెప్పింది.