NTV Telugu Site icon

No-Confidence Motion: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..!

Om Birla

Om Birla

No-confidence Motion Against Lok Sabha Speaker: రాహుల్ గాంధీ అనర్హత దేశంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న సమాచారం ప్రకారం సోమవారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. కాగా, ఇతర పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Savarkar Row: శరద్ పవార్ మధ్యవర్తిత్వం.. సావర్కర్‌ను విమర్శించనని రాహుల్ గాంధీ హామీ..

అయితే లోక్ సభ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సభలో రాహుల్ గాంధీ మాట్లాడే సమయంలో స్పీకర్ కట్ చేయడంపై ఇప్పటికే రాహుల్ గాంధీ లండన్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన వెనువెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను స్పీకర్ ను కలిసేందుకు సమయం అడిగితే నవ్వారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు యోచిస్తున్నట్లు సమాచారం.

Show comments