Site icon NTV Telugu

Operation Sindoor: పాక్ F-16, J-17 ఫైటర్ జెట్‌‌లు ధ్వంసం చేశాం.. 300 కి.మీ లోపల దాడులు చేశాం..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16, చైనీస్ J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత్ జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్‌ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు.

Read Also: Taliban: భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌‌కు రుచించని పరిణామం..

పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘‘ ఆపరేషన్ సిందూర్‌లో, అమాయక ప్రజలను చంపినందుకు ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవడం మీరు చూశారు. మేము మా లక్ష్యాన్ని సాధించిన విషయాన్ని ప్రపంచం చూసింది. మేము పాకిస్తాన్ లోపల 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించాము. ఆపై వారు (పాకిస్తాన్) కాల్పుల విరమణను కోరారు’’ అని ఏపీ సింగ్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే తానే యుద్ధాన్ని ఆపానని చెప్పిన విషయాలు తప్పని ఏపీ సింగ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది. రాబోయే యుద్ధాలు, మునుపటి కన్నా భిన్నంగా ఉంటాయని, ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (SAMలు) నిర్ణయాత్మకంగా మారాయని అన్నారు.

Exit mobile version