Site icon NTV Telugu

Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. ఇండోనేషియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌లో కెప్టెన్ కుమార్ ఒక ప్రజెంటేషన్ ఇస్తూ.. ఆపరేషన్ అడ్డంకులు ఎదుర్కొందని, రాజకీయ నాయకత్వం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వారి వైమానిక ఆస్తులపై దాడులు చేయకూడదని కోరుకుందని చెప్పారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ మహిళపై రాజకీయ నేత అత్యాచారం..

‘‘భారత్ కొన్ని విమానాలను కోల్పోయిందని, పాకిస్తాన్ మిలిటరీ ఆస్తులపై దాడి చేయకూడదనే రాజకీయ నిర్ణయం వల్లే ఇది జరిగింది’’ అని జూన్ 10న ఇండోనేషియా సెమినార్‌లో కెప్టెన్ శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించిందని విమర్శించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో.. గతంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సింగపూర్‌లో జరిగిన ఒక సమావేశంలో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు కొన్ని వైమానిక నష్టాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, పాకిస్తాన్ చెబుతున్నట్లు ‘‘ఆరు విమానాలను కూల్చేశాం’’ అనే ప్రకటనను మాత్రం తోసిపుచ్చారు.

Exit mobile version