Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

  • ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది..
  • 13 పాక్ విమనాలు, 11 స్థావరాలనున ధ్వంసం చేసిన భారత సైన్యం..
  • కీలక వివరాలను బయటపెట్టిన భారత సైన్యాధికారులు..
Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భారత సైన్యాధికారులు అభివర్ణించారు. ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా సైన్యాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ సమయంలోనే పాక్ సైన్యం భారత భూభాగాలపై చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సిందూర్ కీలక విజయమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ అవధేష్ భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సంయుక్తంగా పేర్కొన్నారు.

Read Also: Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

భారత్ పాకిస్తాన్‌కు చెందిన 13 విమానాలను కూల్చేసిందని, 11 స్థావరాలను ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా పాకిస్తానీ సైనికులను హతమార్చిందని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 65 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వాడినట్లు సైన్యం చెప్పింది. ఆపరేషన్ నిలిపేయాలని ముందుగా పాకిస్తాన్ అభ్యర్థించింది. భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఎల్లప్పుడు దృఢత్వంతో, వృత్తి నైపుణ్యంతో కాపాడుకుంటుందని జనరల్ ఘాయ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ముగింపు కాదని, ఇది కొత్త ఆరంభమని చెప్పారు.