Operation Kaveri: కల్లోలిత ఆఫ్రికా దేశం సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో భారత ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. తాజాగా తొలి విడత భారతీయులతో ఢిల్లీకి విమానం చేరుకుంది. సూడాన్ సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఆ దేశంలో సంక్షోభానికి దారితీశాయి. దీంతో సూడాన్ లో ఉంటున్న భారతీయులు చిక్కుకుపోయారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 4వేల వరకు భారతీయులు సూడాన్ లో ఉన్నట్లు అంచనా.
Read Also: RCB vs KKR: ముగిసిన కేకేఆర్ బ్యాటింగ్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
ఈ నేపథ్యంలో ఆపరేషన్ కావేరి పేరుతో ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికా, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం సహాయంతో సూడాన్ లో 72 గంటల కాల్పుల విమరణ ప్రకటించడంతో భారతీయుల తరలింపు వేగవంతం అయింది. ముందుగా భారతీయుల్ని సౌదీ అరేబియా లోని తీరప్రాంత నగరం అయిన జెడ్డాకు తరలించి అక్కడ నుంచి విమానం ద్వారా ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ రోజు తొలివిడతగా 360 మందితో కూడిన విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం మిషన్ ను పర్యవేక్షించేందుకు కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీ. మురళీధరన్ జెడ్డాలోనే ఉన్నారు.