UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ ఇటీవల ఔరంగజేబుని కీర్తించడం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలోనే యోగి నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అబూ అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కతిని నమ్మని వారు, వాటికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు ఎవరినైతే కీర్తిస్తున్నారో వారి గతిని చూడాలని అన్నారు. మానసిక వికలాంగులు అయిన వ్యక్తి మాత్రమే ఔరంగజేబుని ఆదర్శవంతమైన వ్యక్తిగా భావిస్తారని చెప్పారు. తెలివైన ఏ వ్యక్తి కూడా క్రూరమైన పాలకుడిని గౌరవించరని అన్నారు. ‘‘ఎవరైనా ఔరంగజేబుని నమ్మితే, తన సొంత కొడుకుకు ఔరంగజేబు పేరు పెట్టాలి. ఔరంగజేబు తండ్రి షాజహాన్ ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని తీవ్రంగా వ్యతిరేకించారు.
Read Also: Kakani Govardhan Reddy: జగన్ వద్ద ఎలాంటి కొటరీలు లేవు..
ఔరంగజేబు గురించి షాజహాన్ రచనలను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. ‘‘ఔరంగజేబు లాంటి దౌర్భాగ్యుడు ఎవరికీ ఉండకూడదని షాజహాన్ స్వయంగా తన జీవిత చరిత్రలో రాసినప్పుడు, ఔరంగజేబు గురించి మనం ఇతరుల నుండి ఎందుకు వినాలి? హిందూ మతానికి చెందిన కుమారులు మంచివాడని, ఎందుకంటే అతను తన తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు సేవ చేస్తాడు, వారు మరణించిన తర్వాత వారి ఆత్మలకు ఆరాధిస్తాడు అని ఆయన విలపించారు. కానీ నువ్వు ఔరంగజేబు, నన్ను దాహంతో చనిపోయేలా వదిలేశావు’’ అని షాజహాన్ రచనల్ని యోగి ప్రస్తావించారు.
ఔరంగజేబు అధికారంలో కోసం తండ్రి షాజహాన్‌ని ఆగ్రా కోటలో బంధించడంతో పాటు ఆయన సోదరుడు దారాషికోని అత్యంత దారుణంగా తల నరికి చంపాడు. ఆ తర్వాత షాజహాన్‌ని కోటలో బంధించి ప్రతీ 24 గంటకు చిన్న కుండలో నీటిని మాత్రమే ఇచ్చేవారు. చివరి రోజుల్లో ఎంతో బాధను అనుభవించి షాజహాన్ మరణించాడు.