Site icon NTV Telugu

One Charger For All Gadgets: తీరనున్న కష్టాలు..! అన్ని రకాల గాడ్జెట్స్‌కు ఒకే ఛార్జర్‌..

Charger

Charger

ఇల్లు వదిలి ఏదైనా కొత్త చోటికి వెళ్లినా.. గ్రామానికి వెళ్లినా.. మరో ప్రాంతానికి వెళ్లినా.. తమ దగ్గర ఉన్న గాడ్జెట్స్‌కు సంబంధించిన ఛార్జర్‌ను క్యారీ చేయడం తప్పనిసరి అయ్యింది.. ఎందకంటే.. తమ గాడ్జెట్‌కు సంబంధించిన ఛార్జర్‌ అక్కడ ఉంటుందో..? లేదో..? అనే సందేహాం.. అయితే.. ఆ కష్టాలు మాత్రం త్వరలోనే తీరిపోనున్నాయి.. ఎందుకంటే.. కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్‌ను కొత్తగా కొనాల్సిన పనిని తప్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది.

Read Also: Wednesday Special Sri Ganesha Sahasranama Stotram Live: ఈ రోజు ఇంట్లో ఈ స్తోత్రం వింటే చాలు

స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లతో సహా వివిధ రకాల పరికరాల కోసం సాధారణ ఛార్జర్‌.. అంటే ఒకే రకమైన ఛార్జర్‌ను తీసుకొచ్చేలా ప్రభుత్వం అన్వేషిస్తోంది.. దీనిపై చర్చించడానికి ఆగస్టు 17న సమావేశం నిర్వహించనున్నట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. మొబైల్ తయారీదారులు మరియు ఆ రంగంలోని నిర్దిష్ట సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నారు.. బహుళ ఛార్జర్ల వినియోగానికి ముగింపు పలికే అవకాశాలపై చర్చించనున్నారు.. ఇది అమల్లోకి వస్తే ఈ-వ్యర్థాలను నిరోధించడంతో పాటు వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.. మొత్తంగా 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటికీ యూఎస్‌బీ–సీ పోర్ట్‌ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉన్న విషయం తెలిసిందే..

ఆయా కంపెనీలు యూరప్ మరియు యుఎస్‌లో అన్ని గాడ్జెట్స్‌ కోసం ఒకే ఛార్జర్‌ చేయగలిగితే, వారు భారతదేశంలో ఎందుకు చేయలేరు? స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌ల వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలకు సాధారణ ఛార్జర్ ఉండాలి కదా? అని ఓ అధికారి ప్రశ్నించారు. భారతదేశం ఈ మార్పు కోసం ఒత్తిడి చేయకపోతే, అటువంటి ఉత్పత్తులు ఇక్కడ డంప్ చేయబడవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే, గతంతో పోలిస్తే.. ఇప్పటికే చార్జర్ల బెడద కొంత తగ్గిందా…? అయినా మీ దగ్గర సీ టైప్‌ ఉందా? నార్మల్‌ చార్జర్‌ ఉందా? అనే అడివారు ఇప్పటికీ ఉన్నారు.. కానీ, త్వరలోనే ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నమాట.

Exit mobile version