Rajasthan: రాజస్థాన్ దౌసాలో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. పోలీసులు గురువారం 1,000 కిలోల పేలుడు పదార్థాలతో దౌసాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. అయితే ఈ పేలుడు పదార్థాలు మొత్తం అక్రమ మైనింగ్ కు సంబంధించినవిగా పోలీస్ అధికారులు నిర్థారించారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు.
Read Also: Off The Record: కలెక్టర్లపై గురి పెట్టిన బండి సంజయ్.. కొందరు ఐఏఎస్‌లు టచ్‌లో ఉన్నారా?
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లో పర్యటించనునన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే సోహ్నా-దౌసా స్ట్రెచ్‌ను ఫిబ్రవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం కలకలం సృష్టించింది. దౌసాలో జరగబోయే ప్రధాని కార్యక్రమానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా..? అని పోలీసులను ప్రశ్నించినప్పుడు.. అలాంటి క్లూ ఏం దొరకలేదని సమాధానం ఇచ్చారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు.