NTV Telugu Site icon

Viral Video: టేకాఫ్ అయిన వెంటనే ఆగిన ఇంజన్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

Viral Video

Viral Video

Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Brook Shields: రేప్ కు గురైన ‘బ్లూ లాగూన్’ భామ!

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జాయ్‌రైడ్ గ్లైడర్ టేకాఫ్ సాంకేతిక లోపం తలెత్తింది. ధన్‌బాద్‌లోని బర్వద్దా ఎయిర్‌స్ట్రిప్ నుండి గ్లైడర్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఇంజన్ ఆగిపోవడం వీడియోలో చూడవచ్చు. అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఇంటి ముందు ఉన్న కాంక్రీట్ దిమ్మను గుద్దుకుని కుప్పకూలింది. పైలెట్, ప్రయాణికుడు కూర్చుని ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది.

ఈ ప్రమాదంలో ఇంటి యజమాని నీలేష్ కుమార్, అతని కుటుంబసభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఇంట్లో ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్నట్లు వెల్లడించారు. గాయపడిన ప్రయాణికుడిని పాట్నా వాసిగా గుర్తించారు. ఆకాశం నుంచి నగరాన్ని చూసేందుకు గ్లైడర్ రైడ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ధన్‌బాద్ ప్రజలు కోసం ఆకాశం నుండి నగరాన్ని చూసి ఆనందించడానికి ఈ గ్లైడర్ సేవ ప్రారంభించబడింది. ఘటన తర్వాత నగరంలో వైమానిక పర్యటనను ప్రస్తుతానికి నిలిపివేశారు.