NTV Telugu Site icon

Kanwar Yatra: కన్వర్ యాత్రపై సోనూసూద్ పోస్ట్.. ‘‘హలాల్’’తో రిప్లై ఇచ్చిన కంగనా రనౌత్..

Sonu Sood Kangana Ranaut

Sonu Sood Kangana Ranaut

Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రా మార్గంలో షాపులు, హోటళ్లు ఇతర దుకాణాల యజమానులు వారి పేర్లను ప్రదర్శించాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది. ప్రియాంకాగాంధీ ఈ రూల్స్‌ని రాజ్యాంగపై దాడిగా అభివర్ణించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వీటిని దక్షిణాఫ్రికా ‘వర్ణవివక్ష’, హిట్లర్ నాజీ రూల్స్‌గా విమర్శించారు. జావెద్ అక్తర్ వంటి వారు రూల్స్‌ని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే, ఈ నిబంధనలపై యాక్టర్ సోనూ సూద్ ట్వీట్ చేశారు. షాపుల నేమ్ ప్లేట్‌పై ‘మానవత్వం’ మాత్రమే ప్రదర్శించాలని పోస్ట్ చేశారు. అయితే, దీనిపై ఎంపీ, బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ స్పందించారు. సోనూసూద్ వైఖరిపై స్పందించిన కంగనా ‘‘ అంగీకరిస్తున్నాను. హలాల్ స్థానంలో ‘మానవత్వం’ ’’ అని ట్వీట్ చేశారు.

Read Also: Minister Ravi Kumar: ఏపీలో భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

అంతకుముందు బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ స్పందిస్తూ.. “ముజఫర్‌నగర్ యుపి పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు జరిగే మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు మరియు వాహనాలు కూడా యజమాని పేరును ప్రముఖంగా మరియు స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు? జర్మన్‌లో నాజీలు దుకాణాలు, ఇళ్లపై ప్రత్యేక గుర్తు ఉంచేవారు’’ అని ట్వీట్ చేశారు.

శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. యాత్రికుల విశ్వాసం, పవిత్రతను కాపాడేందుకు కన్వర్ మార్గాల్లో ఆహారం, పానీయాలు అమ్మే దుకాణాల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ రూల్స్‌పై ముజఫర్ నగర్ పోలీసుల స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.