NTV Telugu Site icon

CJI DY Chandrachud: సీజేఐగా లాస్ట్ వర్కింగ్ డే.. అలీగఢ్‌ యూనివర్సిటీపై కీలక తీర్పు..

Dy Chandrachudu

Dy Chandrachudu

CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్లుండి పదవి విరమణ చేయనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ కు ఇవాళ సీజేఐగా చివరి వర్కింగ్ డే. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సుప్రీం కోర్టులో చంద్రచూడ్ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగనుంది. అయితే, సీజేఐగా డీవై చంద్రచూడ్ లాస్ట్ వర్కింగ్ డే రోజు కీలక తీర్పు వెలువరించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉందా లేదా అనే అంశాన్ని అత్యున్నత న్యాయం తేల్చనుంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సహా ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30 కింద అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందా లేదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించబోతుంది. ఈ కేసులో 8 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Read Also: SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య

కాగా, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎంపిక అయ్యారు. సంజీవ్ ఖన్నాను సీజేఐగా నియామకం చేస్తూ ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం కానున్నారు. 2025 మే 13వ తేదీ వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కొనసాగనున్నారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న సంజీవ్ కన్నా.. థీస్ హజారి జిల్లా కోర్టు హైకోర్టు ట్రిబ్యునల్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అలాగే, 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా..
2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరిలో సుప్రీంకోర్టు జస్టిస్ గా పదోన్నతి పొందారు.

Show comments