Site icon NTV Telugu

Crocodile Attack: కొత్త బైక్ కొన్న ఆనందం ఆవిరైంది.. గంగా జలం కోసం వెళ్తే మొసలికి ఆహరమయ్యాడు..

Crocodile Attack

Crocodile Attack

Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.

Read Also: Amit Sha Tour: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళి పలువురు ప్రముఖులతో భేటీ..!

బీహార్‌లోని వైశాలి జిల్లాలోని రాఘోపూర్ దియారాకు చెందిన 5వ తరగతి విద్యార్థి అంకిత్ కుమార్ కుటుంబం కొత్త మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసింది. బండికి పూజలు చేసే ముందు కుటుంబం గంగా నదిలో స్నానమాచరించి, గంగా నీటితో బండికి పూజ చేయాలని భావించారు. అయితే కుటుంబం నదిలో స్నానం చేస్తుండగా.. అంకిత్ పై మొసలి దాడి చేసింది. అకింత్ ను నీటిలోకి ఈడ్చుకెళ్లి ముక్కులు ముక్కలుగా కొరికి సజీవంగా తినేసింది.

గంట తర్వాత కుటుంబం అంకిత్ అవశేషానలు గంగా నదిలో నుంచి బయటకు తీసే సమయంలో ఒడ్డుపై గ్రామస్థులు గుమిగూడారు. బాధిత కుటుంబం, ప్రజలు మొసలిని బటయకు లాగి కర్రలు, రాడ్ లతో దాడి చేసి, చనిపోయే వరకు కొట్టారు. పిల్లాడిని చంపిందనే కోపంతో మొసలిపై పగ తీర్చుకున్నారు.

Exit mobile version