NTV Telugu Site icon

Atal Setu Bridge: ఏమైందో పాపం.. అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య.. వీడియో వైరల్..

Atal Setu

Atal Setu

Atal Setu Bridge: ముంబైలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన సూసైడ్ స్పాట్‌గా మారుతోంది. తాజాగా 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం అటల్ సేతుపై తన వాహనాన్ని ఆపి, అక్కడ నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోంబివాలిలోని పలావా నగరానికి చెందిన కరటూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో కారులో బ్రిడ్జిపైకి వచ్చి కారు పార్క్ చేసి వంతెనపై నుంచి దూకినట్లు సమాచారం. వంతెన వద్ద ఉన్న టోల్ కంట్రోల్ రూపం నవషేవా పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటన బ్రిడ్జి అమర్చిన సీసీటీవీల్లో ఈ ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి. అటల్ సేతు ఓపెన్ అయిన తర్వాత ఇది రెండో ఆత్మహత్య ఘటన.

Read Also: PM Mudra Loan: రూ.20లక్షలకు పెరిగిన ముద్రా లోన్.. పూర్తివివరాలు ఇవే..

రెస్క్యూ టీం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆధార్ కార్డు , లోధా కంపెనీ ఐడీ కార్డు ఉన్న పర్సును మాత్రమే కారులో వదిలాడు. కారులో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇంజనీర్ అయిన శ్రీనివాస్ గతంలో కువైట్‌లో పనిచేశారు. 2023లో తిరిగి ముంబై వచ్చాడు. ఆ తర్వాత కొంత కాలాని లోధా గ్రూపులో ఉద్యోగిగా చేరారు. కువైట్లో ఉన్న సమయంలో కూడా శ్రీనివాస్ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన భార్య స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. చివరిసారిగా శ్రీనివాస్ మంగళవారం తన బంధువులతో మాట్లాడాడని పోలీసులు తెలిపారు.