Site icon NTV Telugu

Omicron variant XE: ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ కలకలం.. గుజరాత్‌లోనూ వెలుగు చూసింది..!

కరోనా కల్లోలం నుంచి బయటపడి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఒమిక్రాన్‌ రూపంలో థర్డ్‌ వేవ్‌ ఎటాక్‌ చేసినా.. మళ్లీ కేసులు తగ్గిపోయాయి.. ఈ మధ్య కేసులు పెరుగుతోన్న ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం.. వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసులను ప్రస్తావిస్తూ.. అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్‌ భూషణ్‌ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు రాకేష్‌ భూషణ్‌. మరోవైపు.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న సరికొత్త బ్రిటన్‌ వేరియంట్‌ ఎక్స్‌ఈ.. భారత్‌లోనూ వెలుగు చూసింది.. ఇప్పటికే ముంబైలో ఈ కేసు నమోదు అయినట్టు వార్తలు రాగా.. తాజాగా గుజరాత్‌లో ఓ వ్యక్తి కూడా దాని బారిన పడ్డారు.. ఇక, ఎక్స్‌ఎం వేరియంట్‌ కూడా వెలుగుచూసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ వారం మొదట్లో.. విదేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి ఎక్స్‌ఈ వేరియంట్‌ బారిన పడ్డట్లు మీడియాలో కథనాలు రాగా.. వాటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.. అది ఎక్స్‌ఈ వేరియంట్‌గా నిరూపితం అవ్వలేదని పేర్కొంది.

Read Also: Death threat: ఎప్పుడైనా చంపేస్తాం.. మాజీ సీఎంలు సహా 61 మందికి బెదిరింపులు..!

Exit mobile version