Site icon NTV Telugu

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో చేతులు కలుపుతుందా.. క్లారిటీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..

Omar Abdullah

Omar Abdullah

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), బీజేపీ కలుస్తుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే, ఎన్‌సీ ఈ వాదనల్ని ఆదవారం తోసిపుచ్చింది. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది జర్నలిస్టులు ఈ వార్తలు ప్రచురిస్తున్నారని, ఈ వార్తలు పచ్చి అబద్ధమని ఎన్‌సీ ముఖ్య అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ అన్నారు.

Read Also: 2025 Honda Activa: ‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..

కేంద్రపాలి ప్రాంతాన్ని రాష్ట్ర హోదాకు మారిస్తే జమ్మూ కాశ్మీర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌సీ, బీజేపీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధమువుతందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘ఎవరైనా ఇలాంటి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడం అవమానకరం, బాధ్యతారాహిత్యం… ఈ కట్టుకథ వెనుక ఉన్న వ్యక్తిని నేను సవాలు చేస్తున్నాను. ఒమర్ అబ్దుల్లాని కలిసినట్లు ఆరోపించబడిన బీజేపీ అగ్ర నేత పేరు చెప్పంది లేదా మీ కథనాలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పండి’’ అంటూ తన్వీర్ సాదిక్ ఓ పోస్టులో చెప్పారు.

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం ఒమర్ అబ్దుల్లా కలిశారని చెప్పారు. ఈ కల్పిత కథనాలను తక్షణమే ఉపసంహరించకుంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, ఇలాంటి నిజాయితీ లేని జర్నలిజాన్ని సహించేది లేదని ఆయన అన్నారు.

Exit mobile version