Site icon NTV Telugu

JK: ఎల్లుండి జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

Omarabdullah

Omarabdullah

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి రావాలంటూ లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. దీంతో ఒమర్ అబ్దుల్లాను ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ద్రౌపది ముర్ము ఎత్తేశారు. దీంతో బుధవరం ఎన్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఇదిలా ఉంటే స్వతంత్రంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒమర్ అబ్దుల్లా మద్దతు తెలిపారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ

ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అలాగే బీజేపీ కూడా ఆశించిన స్థాయిలో స్థానాలను గెలుచుకుంది. మునుపటి కంటే ఎక్కువగా సీట్లు సాధించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. కాంగ్రెస్ అంతగా సీట్లు సాధించలేదు గానీ.. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పోటీ చేయడంతో మంత్రి పదవులు ఆశించే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version