Omar Abdullah: పాక్ ప్రధానికి ఒమర్‌ అబ్దుల్లా వార్నింగ్..

  • పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిలో తటస్థ విచారణకు సిద్ధం: పాక్ ప్రధాని
  • పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్
  • పాక్ ప్రధాని కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఒమర్ అబ్దుల్
Omar Abdula

Omar Abdula

Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆ పాశవిక సంఘటనను తొలుత పాకిస్థాన్‌ తోసిపుచ్చి.. ఆ ఘటన వెనక భారత్‌ ఉందని తొలుత ఆరోపించింది అన్నారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందు ఉండే వాళ్లకు ఇప్పుడేం చెప్పలేం అన్నారు. పాక్ ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదన్నారు. ఈ దురదృష్టకరమైన ఘటన జరిగి ఉండాల్సింది కాదని సీఎం ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

Read Also: KKR vs PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఊచకోత.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

×
×
Ad

అయితే, పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌.. తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కుంటోందని వ్యాఖ్యనించారు. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ విచారణలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శాంతికే మా మొది ప్రాధాన్యం అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ పేర్కొనడంపై జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు.