Site icon NTV Telugu

Om Birla: మహిళా శక్తితో ప్రపంచంలో ముఖ్య దేశంగా భారత్..

Om Birla

Om Birla

Om Birla: మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ‘‘మహిళా సాధికారత సదస్సు’’లో ఆయన మాట్లాడారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు.

Read Also: Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం.. రెడ్డిట్ పోస్ట్ వైరల్..

అనేక కీలక రంగాల్లో మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటూ రాణిస్తున్నారని, సామాజిక బంధనాలను ఛేదించుకుని అనేక ఉద్యమాల్లో వారు పాల్గొన్నారని అన్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారన్నారు. రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైన్యంలోనూ స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, మహిళా ప్రగతి, భారత ప్రగతి అని అన్నారు. వారు సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ వల్ల కలిగే ఇబ్బందులను మహిళలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

Exit mobile version