Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చారు. ఒకప్పుడు దు:ఖంతో నిండి ఉన్న ఆ ఇళ్లు, ఇప్పుడు సంతోషంగా ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ హేమ రాజ్ మీనా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి సమయంలో, దు:ఖంలో ఉన్న హేమరాజ్ భార్యని ఓదారుస్తూ, ఆమెకు కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
హేమరాజ్ కుమార్తె వివాహ కార్యక్రమంలో ‘‘భట్’’ ఆచారాన్ని ఓం బిర్లా నిర్వహించారు. ఇది రాజస్థాన్‌లోని సంగోడ్ లో ఈ పెళ్లికి వచ్చిన వారందర్ని కదిలించింది. 2019లో పుల్వామా దాడిలో మరణించిన హేమరాజ్ మీనా భార్య వీరాంగన మధుబాల మీనా ఇంట్లో శుభకార్యానికి హాజరుకావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Read Also: Fake Baba: జాతకం చెడిందన్నాడు.. కానీ జేబు మాత్రం బాగా నిండించుకున్నాడు
2019లో స్పీకర్ ఓం బిర్లా దు:ఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. వారికి అండగా ఉంటానని, ఒక సోదరుడిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో మధుభాల ఓం బిర్లాకు ఓ సోదరిలా రాఖీ కడుతూ వస్తోంది. జవాన్ కుమార్తె వివాహ కార్యక్రమంలో ఒక సోదరుడిగా ఓం బిర్లా మారారు.
ఓం బిర్లాతో పాటు సంగోడ్ ఎమ్మెల్యే, రాజస్థాన్ ఇంధన మంత్రి హీరాలాల్ నగర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు,స్పీకర్ హేమరాజ్ మీనా విగ్రహానికి పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించారు. అతని ధైర్యం మరియు దేశం పట్ల ప్రేమ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఎల్లప్పుడూ అతని కుటుంబానికి అండగా నిలబడటం నా పవిత్ర కర్తవ్యమని ఓం బిర్లా అన్నారు.