Olympian Sushil Kumar To Face Murder Trial For Junior Wrestler’s Death: మే 2021లో మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ మరణించిన కేసులో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యానేర విచారణను ఎదుర్కొనున్నారు. బుధవారం సుశీల్ కుమార్ పై ఢిల్లీ కోర్టు హత్యా నేరాన్ని మోపింది. దీంతో పాటు 17 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై కూడా కోర్టు అభియోగాలను మోపింది.
ఛత్రసాల్ స్టేడియం కేసులో ముండ్కా ప్రాంతంలో గతేడాది మే 23న సుశీల్ కుమార్ తో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదంపై సుశీల్ కుమార్, అతని సహచరులు మే4, మే5 మధ్య రాత్రి జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్, అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్ లపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాగర్ ధంకర్ తర్వాత మరణించాడు. గతేడాది ఆగస్టులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్ లో సుశీల్ కుమార్ తో పాటు 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుశీల్ కుమార్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా హత్య, అపహరణ అభియోగాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టుకు తెలిపారు.
Read Also: Vande Bharat Train: రేపు నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
గతేడాది మే18న, సుశీల్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ.. ఢిల్లీ రోహిణిలోని కోర్టును ఆశ్రయించాడు. తనపై దర్యాప్తు పక్షపాతంగా జరిగిందని..అయితే కోర్టు మాత్రం అతనికి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సుశీల్ కుమార్ ను ప్రధాన కుట్రదారుగా కోర్టు ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టులో వ్యతిరేకించారు. ఈ కేసులో సాక్షులు సుశీల్ కుమార్, అతని సహచరులను చూసి భయపడుతున్నారని పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరు రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు. 2010లో రెజ్లింగ్ లో ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ లో అనేక సార్లు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు.
సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించాడు.
