NTV Telugu Site icon

Akhilesh Yadav: పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు

Akhileshyadav

Akhileshyadav

కొత్త పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారం కురిసిన వర్షానికి పార్లమెంట్ హాల్‌లో ధారగా వర్షపు నీళ్లు కారడం.. బకెట్ పెట్టి నింపడం వంటి వీడియోలు బయటకు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Amrapali: నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ

పార్లమెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. పాత పార్లమెంట్ బాగున్నా.. కోట్లు ఖర్చు చేసి కొత్త పార్లమెంట్‌కు తీసుకొచ్చారన్నారు. తీరా ఒక్క వర్షానికే తడిసిముద్దైందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అఖిలేష్ యాదవ్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేసి విమర్శించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని ప్రజలు అడుగుతున్నారని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Wayanad landslide: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్‌బాల్ మైదానాలతో సమానం: ఇస్రో..