NTV Telugu Site icon

USA: భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు..

Usa

Usa

USA: 22 ఏళ్ల క్రితం భారతీయ విద్యార్థిని చంపిన కేసులో దోషికి అమెరికాలో మరణశిక్ష అమలు చేశారు. ఓక్లహోమాలో భారతీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపినందుకు 41 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన 24 ఏళ్ల భారతీయ విద్యార్థి శరత్ పుల్లూరు నిందితుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్న శరత్ పుల్లూరు, 40 ఏళ్ల జానెట్ మూర్‌లను మైఖేల్ డెవెన్ స్మిత్‌ హత్య చేశారు. ఈ ఘటన 2002లో జరిగింది.

Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అప్రమత్తం.. జీపీఎస్ నిలిపివేత, సైనికులకు సెలవులు రద్దు..

మెక్ అలెస్టర్‌లోని ఓక్లహోమా స్టేట్ పెనిటెన్షియరీలో గురువారం దోషి మైఖేల్ డెవెన్ స్మిత్‌కి ప్రాణాంతక ఇంజక్షన్ ద్వారా మరణశిక్ష విధించారు. ఓక్లహోమా అటార్నీ జనరల్ జెంట్నర్ డ్రమ్మాండ్ గురువారం స్మిత్ ఉరితీతపై ప్రకటన విడుదల చేశారు. ‘‘ ఈ రోజు జానెట్ మిల్లర్ మూర్, శరత్ పుల్లూరు కుటుంబాలకు శాంతి చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. మైఖైల్ స్మిత్ చేతిలో హత్యకు గురైన వ్యక్తుల మంచివారు, వారు విధికి అర్హులు కాదు’’ అని అన్నారు. శరత్ పుల్లూరు చదువుకునేందుకు అమెరికా వచ్చాడు, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉన్నాడని డ్రమ్మండ్ ప్రశంసించారు. అర్థరహిత హత్యలపై విచారం వ్యక్తం చేశారు. వారు తప్పుడు సమయంలో, తప్పుడు స్థానంలో ఉన్నందున వారు చంపబడ్డారని అన్నారు. గత నెలలో శరత్ సోదరుడు, హరీష్ పుల్లూర్ నిందితుడు స్మిత్‌కి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దని కోరారు. శరత్ మరణం తమ కుటుంబం చూపిన ప్రభావాన్ని హరీష్ కోర్టుకు వివరించారు.