సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. నిన్నటివరకు వంట నూనెల ధరలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంటనూనె, గోధుమల ధరలు పెంచేందుకు మార్కెట్ సిద్ధం అవుతోంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం కారణంగా భారతదేశం సన్‌ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది.. ఈ వార్త సామాన్య ప్రజలకు చేదు వార్త అనే చెప్పాలి..
ఇక పప్పులు, కూరలు, టమోటాలు, పాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ధరల పెంపుతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఈ జాబితాలోకి వంటనూనె ధరలు, గోధుమల ధరలు కూడా వచ్చి చేరాయి. వీటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మార్కెట్‌లో అనిశ్చితికి దారితీంది.. సామాన్య ప్రజలతో పాటుగా, వ్యాపారులు కుడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
రష్యా , ఉక్రెయిన్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవల నిలిపివేయడం భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత, ధరపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి నల్ల సముద్రం ద్వారా వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతించే ఒప్పందాన్ని రష్యా నిలిపివేసింది. దీంతో భారతదేశానికి సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణాను ఆకస్మికంగా నిలిపివేసింది.. దీని కారణంగా నూనెల ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.. బ్లాక్ సీ గ్రెయిన్ ఒప్పందాన్ని రష్యా నిలిపివేసినందుకు ప్రతిస్పందనగా ప్రపంచ గోధుమ ధరలు కూడా పెరిగాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో సన్ ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరలు మరో 15% పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియాలో కూడా ధరలు భారీగా పెరుగుతాయని తెలుస్తుంది.. ప్రస్తుతం కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇది మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని జనాలు ఆలోచిస్తోస్తున్నారు ..
