Site icon NTV Telugu

Red Ant Chutney: “ఎర్ర చీమల” పచ్చడికి భౌగోళిక గుర్తింపు(GI).. ఈ వంటకం ప్రయోజనాలు, విశేషాలు..

Red Ant Chutney

Red Ant Chutney

Red Ant Chutney: “ఎర్ర చీమల పచ్చడి” గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయితే, ఒడిశాలోని ‘ఎర్ర చీమల పచ్చడి’కి భౌగోళిక గుర్తింపు(GI ట్యాగ్) లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చట్నీ చేస్తారు. తాజాగా దీనికి జీఐ ట్యాగ్ లభించింది. ఈ వంటకంలో ఔషధ గుణాలతో, అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పచ్చడిని నీళ్లతో కూడిన సెమీ-సాలిడ్ పేస్ట్‌ లాగా తయారు చేస్తారు. దీనిని స్థానికంగా ‘కై చట్నీ’ అని పిలుస్తారు. జనవరి 2న ఈ విచిత్రమైన వంటకానికి భౌగోళిక గుర్తింపు లభించింది.

Read Also: Triple Murder Case: ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి-అన్న ఘాతుకం.. భార్యభర్తలతో పాటు రెండేళ్ల చిన్నారి హత్య..

ఎలా తయారు చేస్తారు.? ప్రయోజనాలేంటీ..?

సాధారణంగా ప్రపంచంలో పలు కమ్యూనిటీల్లో కీటకాలతో వంటకాలను చేయడానికి, వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని ‘ఎంటోమోఫాగి’ అంటారు. ఒడిశా ప్రజలు ‘రెడ్ వీవర్ చీమలు’, శాస్త్రీయంగా ఓకోఫిల్లా స్మరాగ్డినా అని పిలుస్తారు. మయూర్‌భంజ్ అడవులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చీమలతో అక్కడి ప్రజలు చట్నీను తయారు చేసి విక్రయిస్తుంటారు. వందలాది గిరిజన కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

వీటిని పట్టుకోవడం అంత సులభం కాదు. మగ చీమలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి. కుడితే విపరీతమైన మంట, నొప్పి కలుగుతుంది. ఈ చీమల్ని పట్టుకుని దంచి చూర్ణంగా చేసి, ఎండబెడతారు. ఆ తర్వాత దీనికి ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి చట్నీగా తయారు చేస్తారు.

ఈ చీమల పచ్చడిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గూ, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసటకు నివారిణిగా పనిచేస్తుంది. చీమలు, వాటి గుడ్లలో ఉండే ఫార్మిక్ యాసిడ్, మానవ జీర్ణవ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో జింక్, కాల్షియం మరియు ప్రోటీన్లు ఉంటాయి, ఇది రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

Exit mobile version