NTV Telugu Site icon

Odisha: స్నేహితులతో కలిసి సోదరిని అత్యాచారం ​చేసిన కామాంధుడు.. గొడ్డలితో నరికి..

Gange Rape

Gange Rape

మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన సోదరిని గ్యాంగ్​ రేప్​ చేశాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు..

వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంథమాల్​ జిల్లాలోని చకపాడ్​ పోలీస్​ స్టేషన్​ పరిథిలో.. నవంబర్​ 3న జరిగింది ఈ ఘటన. నేరస్థులను పోలీసులు పట్టుకోవడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం.. స్థానికంగా నివాసముండే 25ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో, అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సోదరుడిని మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే అందరికి చెప్పేస్తానని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది..

దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. నవంబర్​ 3న మహిళ.. పని మీద అడవుల్లోకి వెళ్లింది. ఆమె, ఆరోజున, అక్కడకి వస్తుందని ముందే తెలుసుకున్న ఆ మహిళ సోదరుడు.. తన నలుగురు స్నేహితులను పిలిపించాడు. వారి చేత మద్యం తాగించాడు. ఆమె కనిపించేసరికి.. వారందరు మహిళపై పడ్డారు. తొలుత.. ఆ వ్యక్తి, తన సోదరిని రేప్​ చేశాడు. అనంతరం.. స్నేహితుల చేత రేప్​ చేయించాడు. మహిళ గట్టిగా అరుస్తోందని.. ఆమె గొంతు నులిమాడు. అక్కడితో ఆగకుండా.. గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయింది..

మహిళ కనిపించలేదని కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నవంబర్​ 6న.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. నవంబర్​ 7, అడవుల్లో వారికి ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె తమ బిడ్డేనని, కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.. పోస్ట్ మార్టం చేసి గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్దారించారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ని అరెస్ట్ చేశారు.. అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది..

Show comments