NTV Telugu Site icon

Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు

Rajashree Swain

Rajashree Swain

Odisha Cricketer Rajashree Swain Found Dead In Katak Forest: ఒడిశాలో ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అడవిలో శవమై కనిపించింది. కటక్‌కి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒక చెట్టుకు వేలాడుతూ, ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రాజశ్రీ మృతదేహం లభ్యమైన కొంతదూరంలో ఆమె స్కూటర్ లభించింది. చెట్టుకు వేలాడుతూ కనిపించింది కాబట్టి.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది ఇప్పుడే చెప్పలేమని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె మృతికి కారణం తెలుస్తుందని డీసీపీ పినాక్ మిశ్రా వెల్లడించారు.

Kite String Slits Throat: మాంజా కాదు మృత్యుపాశం.. చిన్నారితో పాటు మరొకరు మృతి

మరోవైపు.. రాజశ్రీ కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, కళ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. దట్టమైన అడవికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్న పాయింట్‌ని లేవనెత్తుతున్నారు. ఎవరో కుట్ర పన్ని రాజశ్రీని హతమార్చారని పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. కాగా.. రాజశ్రీ స్వైన్ ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన క్రికెటర్. పుదుచ్చేరిలో జరిగే క్రికెట్ టోర్నీ కోసం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు కటక్ వచ్చింది. అయితే.. 16 మందితో కూడిన జట్టులో మాత్రం ఆమె స్థానం సంపాదించుకోలేకపోయింది. జట్టులో తన పేరు లేకపోవడంతో.. రాజశ్రీ భోరున విలపించిందని ఆమె రూమ్మేట్ వెల్లడించింది. ఆ తర్వాత ఆమె హోటల్ గదికి రాలేదని తెలిపింది. రాజశ్రీ అదృశ్యంపై కోచ్ పుష్పాంజలి బెనర్జీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.

Show comments