NTV Telugu Site icon

Nupur Sharma: నుపుర్ శర్మను చంపేందుకు కుట్ర.. సరిహద్దు దాటిన పాకిస్తాన్ వ్యక్తి

Nupur Sharma

Nupur Sharma

nupur sharma-prophet row: మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లారడం లేదు. ఏదో వివాదం ఈ అంశం కేంద్రంగా వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ముస్లిం మతఛాందసవాదులు నుపుర్ శర్మను చంపేస్తామని.. మరికొంత మంది మత ప్రముఖులు నుపుర్ శర్మను చంపేస్తే నజరానాలు ప్రకటించడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా నుపుర్ శర్మను చంపేందుకు ఓ పాకిస్తాన్ జాతీయుడు ఏకంగా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్ లో పాక్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సదరు పాకిస్తాన్ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), ఇతర ఇన్వేెస్టిగేషన్ ఏజెన్సీలు విచారిస్తున్నాయి.

Read Also: Andhra Pradesh: అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్‌..

జూలై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్ కోట్ సరిహద్దు ఔట్ పోస్ట్ దగ్గర పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేసిటన్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారి వెల్లడించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ దళాలు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 11 అంగుళాల కత్తి, మతమరమైన పుస్తకాలు, బట్టలు, ఆహరాన్ని స్వాధీనం చేస్తున్నారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ బహౌద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ గా గుర్తించాయి భద్రతా బలగాలు. ప్రాథమిక విచారణలో నుపుర్ శర్మను చంపేందుకు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అజ్మీర్ దర్గాలను సందర్శించాలని నిందితుడు భావించినట్లుగా వెల్లడించారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 8 రోజుల పోలీస్ కస్టడీని విధించింది. పాకిస్తాన్ వ్యక్తి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా విచారిస్తోంది.