NTV Telugu Site icon

NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!

Neet

Neet

NEET-UG 2024: వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు జరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని క్యాన్సిల్ చేసి జూన్ 23వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారి ఫలితాలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇవాళ రిలీజ్ చేసింది. దీంతో పాటు నీట్‌ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు పేర్కొనింది.

Read Also: Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”

కాగా, మొత్తం 1,563 మందికి ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా.. దానికి కేవలం 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఆ రీ-ఎగ్జామ్‌ ఫలితాలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీని నీట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ఫలితాల తర్వాత నీట్‌ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్టీఏ చెప్పుకొచ్చింది. సవరించిన స్కోర్‌ కార్డులను https://exams.nta.ac.in/NEET/లో చూసుకోవచ్చు అని తెలిపింది. త్వరలోనే నీట్‌ కౌన్సెలింగ్ జరగే అవకాశం ఉంది.

Read Also: Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో!

అయితే, నీట్‌-యూజీ 2024 పరీక్షా ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొందరు అభ్యర్థులు, పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేలరేగాయి. పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు కలపడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా.. గ్రేస్‌ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ ఎక్జామ్ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలాఉండగా.. నీట్‌ క్వశ్చన్ పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుంది.