NTV Telugu Site icon

Digital arrest: ఎన్ఆర్ఐ సిస్టర్స్ “డిజిటల్ అరెస్ట్”.. రూ. 1.9 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు..

Digital Arrest

Digital Arrest

Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా, ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ అక్కాచెల్లెళ్లు ఇలా ‘డిజిటల్ అరెస్ట్’కి గురయ్యారు. బాధితులను సుమన్ కక్కర్, వినయ్ తప్లియాల్‌లుగా గుర్తించారు. లక్నోలో దాదాపుగా రూ. 1.9 కోట్లు మోసగించారు. స్కామర్లు ఇద్దర్ని డిజిటల్ అరెస్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు.

Read Also: Masood Azhar: పాక్‌లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..

బాధితుల ఇద్దరి బ్యాంక్ అకౌంట్స్‌ని తీవ్రవాద లావాదేవీలకు ఉపయోగించారని, జీవిత ఖైదు నుంచి తప్పిస్తామని చెబుతూ, స్కామర్లు ఇద్దరి నుంచి భారీ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఇద్దరు బాధితులు కూడా కెనడియన్ పౌరులుగా గుర్తించారు. పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. స్కామర్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నలిస్తూ వీడియో కాల్‌ ద్వారా ఇద్దర్ని భయపెట్టారు. లక్నోలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపైస కేసు నమోదైంది. అధికారులు కేవలం రూ. 25 లక్షల్ని మాత్రం ఫ్రీజ్ చేశారు. మిగతా మొత్తం వేర్వేరు రాష్ట్రాల్లోని అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం నిందితులను కనిపెట్టే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు.

Show comments