Site icon NTV Telugu

MP Dhiraj Sahu: “నా డబ్బు కాదు, కానీ”..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..

Dhiraj Sahu

Dhiraj Sahu

MP Dhiraj Sahu: ఇటీవల ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఏకంగా రూ. 350 కోట్ల నగదు పట్టుబడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. గుట్టలు, గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల్ని లెక్కించేందుకు వందలాది మంది అధికారులు, పదుల సంఖ్యలో మిషన్లు అలసిపోయాయి.

Read Also: MLC Sheikh Sabji: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపట్ల కుటుంబసభ్యుల అనుమానాలు

అయితే ఈ వ్యవహారంపై ఎంపీ ధీరజ్ సాహు తొలిసారిగా నోరు విప్పాడు. శుక్రవారం మాట్లాడుతూ.. తన కుటుంబం వ్యాపారాన్ని నిర్వహిస్తోందని, స్వాధీనం చేసుకున్న తనదు తనది కాదని, మద్యం కంపెనీలకు చెందిందని చెప్పాడు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ ఉండగా మనీహేస్ట్ వంటి డ్రామాలు కూడా తక్కువే అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు స్పందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ డబ్బుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.

ధీరజ్ సాహు కుటుంబానికి చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను సోదాలు డిసెంబర్ 6న ప్రారంభమై శుక్రవారం ముగిశాయి. ఒడిశా మరియు జార్ఖండ్‌లో జరిపిన ఈ సోదాల్లో రూ. 353.5 కోట్ల విలువైన నగదు లభించింది, ఇది భారతదేశంలోనే అతిపెద్ద నగదు జప్తుగా రికార్డుకెక్కింది.

Exit mobile version