Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని అందించాలని కోరుకుంటోంది.
ముఖ్యంగా రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో, వారి పని గంటల విషయంలో శ్రద్ధ చూపిస్తోంది. ఎక్కువ పనిగంటల వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించింది. ఈ మెసేజుల్లో ఉద్యోగి రిమోట్‌గా ఎన్ని రోజులు పనిచేవారు, ఎన్ని గంటల పనిచేశాడు, సగటున రోజూ ఎంత టైమ్ సస్పెండ్ చేస్తున్నాడు వంటి వివరాలను పొందుపరుస్తుంది. వర్క్ ఫ్రం హోం పనిచేసేటప్పుడు లాగిన్ అయిన తర్వాత వర్కింగ్ అవర్స్ కన్నా ఎక్కువగా పనిచేస్తుంటే, ఉద్యోగులకు కంపెనీ నుంచి వ్యక్తిగత ఈమెయిల్స్ పంపడం ప్రారంభించింది. సగటున వారంలో 5 రోజులు రోజుకు 9.15 గంటలు పనిచేయాలి, రిమోట్‌గా పనిచేసేటప్పుడు మరికొన్ని గంటలు అదనంగా కూర్చొంటాం, దీని వల్ల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని ఉద్యోగులు చెబుతున్నారు.
Read Also: GST: మధ్యతరగతికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం..
ముఖ్యంగా, ఐటీ ఇండస్ట్రీలో అస్థిరమైన వర్క్ షెడ్యూల్స్ వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది వర్క్ ఫ్రం హోం చేసే వారు పనిగంటలు పొడగించుకోవడంతో, మెరుగైన వర్క్-లైఫ్ అలవాట్లు దెబ్బతింటున్నాయి. దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్‌ని పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులకు పంపుతున్న ఈమెయిల్స్‌లో ‘‘ బ్యాలెన్సుడ్ వర్క్-లైఫ్ షెడ్యూల్’’ అవసరమని కంపెనీ చెబుతోంది. పని విభజన, బాధ్యతల గురించి మీ మేనేజర్‌తో మాట్లాడండి అంటూ మెసేజుల్లో సూచిస్తోంది. ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
