Site icon NTV Telugu

Heart Attack: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన ఇంజనీర్.. గుండెపోటుతో మృతి

Noida

Noida

Heart Attack: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో యుక్తవయసులో పలువురు వ్యక్తులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. చివరకు చిన్న పిల్లల్ని కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రాన్సులు, జిమ్ సెంటర్లలో ఉన్నట్లుండి ఇలా గుండెపోటుకు గురైన పలు సందర్భాలను మనం చూస్తున్నాం. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ మైదానంలోనే మరణించడం విషాదాన్ని నింపింది.

Read Also: Drishti 10: నేవీ కోసం అదానీ గ్రూప్ డ్రోన్ తయారీ.. హైదరాబాద్లో ఆవిష్కరణ..

నోయిడాలో ఓ టెకీ క్రికెడ్ ఆడుతూ పిచ్‌పై కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మరణించిన సంఘటన ఆదివారం నోయిడాలో చోటు చేసుకుంది. ఇంజనీర్ వికాస్ నేగి(36) క్రికెట్ ఆడూతూ, రన్ తీయడానికి ప్రయత్నిస్తూ పిచ్‌ మధ్యలో పడిపోయాడు. ఈ సంఘటనను చూసి ఆటగాళ్లు సాయం చేయడానికి ప్రయత్నించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడికి చేరుకునే లోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి గుండెపోటు కారణమని తెలిసింది.

ప్రాథమిక నివేదిక ప్రకారం.. వికాస్ కోవిడ్ బాధితుడు. కానీ ప్రస్తుతం ఆరోగ్యంతోనే ఉన్నాడు. తనను తాను ఫిట్‌గా ఉంచుకునేందుకు అతను తరుచుగా నోయిడా, ఢిల్లీలో క్రికెట్ ఆడేవాడు. గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు ఎక్కువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. గత ఐదేళ్లుగా భారతదేశంలో దాని ప్రాబల్యం పెరిగింది. కార్డియాక్ అరెస్టులకు పలు ఆరోగ్య కారణాలతో పాటు జీవనశైలిలో అలవాట్లు కారణమని తెలుస్తోంది. గతంలో వృద్ధాప్య దశలో గుండెపోటులు వస్తుండేవి, కానీ ఇప్పుడు 30-40 ఏళ్ల మధ్యలో వారికి కూడా ప్రభావితం చేస్తున్నాయి.

Exit mobile version