Site icon NTV Telugu

Noida: నోయిడాలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. డాగ్‌స్క్వాడ్స్ తనిఖీలు

Nodia1

Nodia1

రిపబ్లిక్ డేకు ముందు పాఠశాలలకు బెదిరింపులు రావడం నోయిడాలో తీవ్ర కలకలం రేపుతోంది. నోయిడాలోని పలు స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తమై పిల్లలను ఇంటికి పంపేశారు.

నోయిడాలోని శివ్ నాడార్, రామగ్య పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఇక పాఠశాల యాజమాన్యాలు.. తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి తీసుకెళ్లిపోవాలని కోరారు. వెంటనే పిల్లలను స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్

ఇక అహ్మదాబాద్‌లో కూడా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాంబు స్క్వాడ్‌ సిబ్బందితో ఆయా స్కూళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపటట్టి నకిలీవిగా తేల్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: రాహుల్ గాంధీ మీటింగ్‌లో అవమానం.. కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ డుమ్మా!

Exit mobile version