NTV Telugu Site icon

Ladakh: లడఖ్‌లో ఒంటరిగా బైక్ రైడ్.. ఆక్సిజన్ అందక యువకుడి మృతి

Ladakh

Ladakh

లడఖ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు బైక్ రైడింగ్‌కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నోయిడాకు చెందిన చిన్మయ్ శర్మ(27) లడఖ్‌లోని లేహ్‌కు ఒంటరిగా బైక్ రైడింగ్‌కు వెళ్లాడు. ఆక్సిజన్ అందక ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌తో ప్రాణాలు వదిలాడు. చిరాగ్ ఆగస్టు 22న విహార యాత్రకు బయలుదేరి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 26న తనకు తలనొప్పిగా ఉందని తన తండ్రికి తెలియజేసినట్లు సమాచారం. విశ్రాంతి తీసుకోవాలని, వైద్య సహాయం తీసుకోవాలని తండ్రి సూచించారు. మరుసటి రోజు చిన్మయ్ శర్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తన తండ్రికి చెప్పాడు. అనంతరం తండ్రి లేహ్‌లోని హోటల్ మేనేజర్‌ని తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాడు. ఆగష్టు 29న చిరాగ్ శర్మ చికిత్స తీసుకుంటూ ప్రాణాలు వదిలాడు. అతని తల్లిదండ్రులు లేహ్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందే మరణించాడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉంటే చిన్మయ్ శర్మ.. తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు.

ఇది కూడా చదవండి: Kanakadurga Flyover: పార్కింగ్ స్పాట్‌గా మారిన బెజవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్..

చిన్మయ్ శర్మ… డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. నోయిడాలో ఉన్న ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు ముజఫర్‌నగర్‌లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. లేహ్ 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఎత్తైన ఎడారి ప్రాంతం. అధిక ఎత్తులో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి కనీసం మూడు రోజులు సమయం పడుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. శరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు గురైనప్పుడు మరియు గాలి పీడనం చాలా త్వరగా మారినప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ సంభవిస్తుంది. తలనొప్పి, వాంతులు, అలసట, శ్వాస ఆడకపోవడం మరియు వికారం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ కారణం చేతనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Suicide: పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఆర్మీ జవాన్ భార్య..

అనారోగ్యంలో మూడు రకాలు ఉన్నాయి: ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్‌నెస్ (AMS) అనేది ఎత్తులో ఉండే అనారోగ్యం, తేలికపాటి రూపం. హై-ఎలిట్యూడ్ సెరిబ్రల్ ఎడెమా (HACE) అనేది AMS యొక్క మరింత తీవ్రమైన రూపం. హై-ఎలిట్యూడ్ పల్మనరీ ఎడెమా (HAPE) త్వరగా ప్రాణాంతకమవుతుంది.