NTV Telugu Site icon

Noida: దీని కోసం “ప్రాంక్” చేస్తారా..? పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఇన్‌స్టా పోస్ట్..

Noida

Noida

Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ “ఆత్మహత్య వీడియో”ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు.

Read Also: Voyager-2: భూమి నుంచి 2 వేల కోట్ల కి.మి. ప్రయాణం.. సిగ్నల్ చేరాలంటే 18 గంటలు.. ఇది వాయేజర్ ఘనత

సూసైడ్ వీడియో చూడగానే గౌతమ బుద్ధనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. వివరాలు తీసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాలుడిని కనుగొన్నారు. ఇదంతా చేస్తే పోలీసులకు మాత్రం ఆ బాలుడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. కొన్ని గంటల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ సూసైడ్ పోస్ట్ ‘‘ప్రాంక్’’ అని తేలింది. ఇన్‌స్టాగ్రామ్ లో తనకు వ్యూస్ తక్కువగా రావడంతో, వ్యూస్ పెంచుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు. మస్కిటో రిఫిల్లర్ ఆల్ అవుట్ లో లిక్విడ్ ను తీసేసి దాంట్లో నీరు నింపి తాను తాగి చనిపోతున్నట్లు బాలుడు వీడియో తీసి పోస్ట్ చేశాడని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బాలుడిని వైద్య పరీక్షలకు పంపించి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

గతంలో నోయిడా పోలీసులు 20 ఏళ్ల వ్యక్తి ‘‘ అంతా అయిపోయింది’’ అనే పోస్ట్ చూసి అతడిని ఆత్మహత్య నుంచి రక్షించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇలాంటి కేసుల్ని చేధించి బాధితులను రక్షించేందుకు 2022లో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాతో ఒప్పందం చేసుకున్నారు. రియల్ టైమ్ లో ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన పోస్టులను గుర్తించి ప్రజలను రక్షిస్తున్నారు.

Show comments