Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురోలా, ఉత్తరకాశీ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి ముంచుకొస్తుందో తెలియడం లేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ నెల 15న మహాపంచాయత్ కు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరకాశీ యంత్రాంతగా ఇందుకు బుధవారం అనుమతి నిరాకరించింది. మహాపంచాయత్ సమయంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు. పురోలా ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Read Also: Human Sacrifice: సవతి తల్లి ఘాతుకం.. 4 ఏళ్ల బాలుడి నరబలి..
పురోలాలో రెండు నెలల క్రితం ఒక ముస్లిం యువకుడు, హిందూ మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. దీంతో అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. అయితే అమ్మాయిని పోలీసులు రక్షించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే గత కొంత కాలం నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా ముస్లిం నివాసాల సంఖ్య పెరుగుతోందని అక్కడి జనాభా స్వరూపం మారుతోందని, హిందూ సంఘాలు చెబుతున్నాయి. పలు రక్షిత అటవీ ప్రాంతాల్లో కూడా వీరి ఆవాసాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇదే సమయంలో ఈ ఘటన లవ్ జిహాద్ కు చెందిన పలు సంఘటనలు వెలుగులోకి రావడంతో ఉత్తర కాశీ జిల్లా అట్టుడుకుతోంది.
ఈ నేపథ్యంలో ఇలా వచ్చిన వారికి వ్యతిరేకంగా, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ‘పురోల ప్రధాన్ సంస్థాన్’ మహాపంచాయత్ కి పిలుపునిచ్చింది. భజరంగ్ దళ్, వీహెచ్పీ వంటి హిందూ సంస్థలు దీనికి మద్దతు తెలిపాయి. అయితే ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అభిషేక్ రోహిల్లా అనుమతిఇవ్వలేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ అన్నారు.