NTV Telugu Site icon

Save Bangladeshi Hindus: హిందూయేతర బంగ్లాదేశీయులకు వైద్యం అందించవద్దు..

Hindus

Hindus

Save Bangladeshi Hindus: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు దేవాలయాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇక, బంగ్లాదేశ్ దురహంకారాన్ని భారత్‌లోనూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన హిందూయేతర రోగులకు చికిత్స చేయరాదని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలోని ముకుంద్‌పూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలైన హిందూ సోదరులు, సోదరీమణులకు ఏమి జరుగుతుందో మాకు బాధగా ఉంది. వారిని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు.. ఇలాంటి వాటిని ఆపేందుకు మా దేశం ఎప్పటికి మొదటి స్థానంలో ఉంటుందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు.

Read Also: Game Changer : నాలుగేళ్ల కిందటి కథైనా.. ఇప్పుడు జరిగేదే సినిమాలో కనిపిస్తుంది : దిల్ రాజు

కాగా, హిందూయేతర బంగ్లాదేశీయులకు వైద్యం అందించడం లేదు మీరందరూ వెళ్లిపోండి అని ఆందోళకారులు కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి మెమోరాండం అందజేశారు. ఇక, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బంగ్లాదేశ్ లోని ముస్లీంలకు చికిత్స అందించడానికి వీలు లేదని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, బంగ్లాదేశ్ లో మన దేశానికి, భారత జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినందుకు నిరసనగా ఈ చర్యలకు దిగినట్లు పేర్కొన్నారు. ఇక, బంగ్లాదేశ్ తో కొనసాగించే వ్యాపారాలను సైతం ఆపేయాలని కోరారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి బంగ్లాదేశ్ లో నిరంతర హింసలు కొనసాగుతున్నాయి.