NTV Telugu Site icon

Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..

Kerala High Court

Kerala High Court

Kerala High Court: స్విగ్గీ, జొమాటోలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. స్విగ్గీ, జొమాటోలు వద్దని పిల్లలకు వారి తల్లి వండి ఆహారాన్ని రుచి చూడనివ్వండి కామెంట్స్ చేసింది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఆర్డర్ చేసే ఆహారానికి బదులుగా పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, వారి తల్లులు వండిపెట్టే ఆహారాన్ని తీసుకునేలా తల్లిదండ్రులు ఒప్పించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ సూచించారు.

పోర్న్ వీడియోలకు సంబంధిచిన కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు పిల్లలకు ఇంటి భోజనం అందించడం యొక్క ప్రాధాన్యతనను వివరించింది. తన మొబైల్‌లో పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు, అతనిపై చేసిన నేరారోపణలను హైకోర్టు కొట్టేసింది. పోర్న్ చూడటం ప్రైవేట్ విషయం అని, వీటిని ఇతరులతో పంచుకుంటేనే ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం నేరంగా కిందకు వస్తుందని పేర్కొంది.

Read Also: Libiya: లిబియాలో వరద బీభత్సం.. 5,300 కి పైగా చేరుకున్న మరణాలు

పిల్లలను హ్యాపీగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఫోన్లు మైనర్ పిల్లలకు ఇవ్వొద్దని, నిఘా లేకపోతే మొబైల్ ఫోన్లను తప్పుగా వినియోగించే అవకాశం ఉందని చెప్పింది. పిల్లలు ఫుట్ బాల్, క్రికెట్ వంటి గేమ్స్ ఆడుకునేలా చేయాలని, ఇది చాలా తప్పనిసరి అని తెలిపింది. హెల్తీ యంగ్ జనరేషన్ ఈ దేశ భవిష్యత్తుకు చాలా అవసరం అని పేర్కొంది. పిల్లలు ప్లే గ్రౌండ్ లో ఆడుకోనివ్వాలని, అమ్మ ఆహారపు మైమరిపించే వాసనతో ఇంటికి తిరిగి వచ్చేలా చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. సరైన పర్యవేక్షణ లేకుండా మైనర్ పిల్లలకు మైబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలను న్యాయమూర్తి తల్లిదండ్రులను హెచ్చరించారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా అశ్లీల వీడియోలను, పోర్న్ కంటెంట్ ను సులభంగా యాక్సెస్ చేయవచ్చని కోర్టు చెప్పింది. వీటిపై జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.