Site icon NTV Telugu

Covid-19 Vaccine: మా వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు: భారత్ బయోటెక్..

Covid Vaccine

Covid Vaccine

Covid-19 Vaccine: బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. ఆస్ట్రాజెనికా ఇండియాతో పాటు పలు దేశాల్లో కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లను అందించింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తమ కోవిడ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని గురువారం ప్రకటించింది. కోవాగ్జిన్ పేరుతో ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసింది. భారత ప్రభుత్వ కోవిడ్-19 ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భారతదేశంలో ఎఫికసీ ట్రయల్స్ నిర్వహించిన ఏకైక కోవిడ్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ అని తెలిపింది.

Read Also: Raebareli: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్.. ఎవరు ఇతను..?

‘‘కోవాగ్జిన్ తన లైసెన్సు ప్రక్రియలో భాగంగా 27,000 కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్షించాం. ఇది క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో పరిమిత వాడకానికి లైసెన్స్ చేయబడింది. అనేక వందల వేల సబ్జెక్టుల కోసం వివరణాత్మక భద్రతా రిపోర్టింగ్ నిర్వహించబడింది’’ అని ఫార్మా దిగ్గజం తెలిపింది. కోవాక్సిన్ యొక్క భద్రతను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అంచనా వేసిందని చెప్పింది. కోవాగ్జిన్ ఉత్పత్తి సమయంలో భద్రతా పర్యవేక్షణ కొనసాగిందని, రక్తం గడ్డకట్టడం, థ్రోంబోసైటోపెనియా, TTS, VITT, పెరికార్డిటిస్, మయోకార్డిటిస్ మొదలైన సైడ్ ఎఫెక్ట్స్ వంటివి లేకుండా అద్భుతమైన భద్రతా రికార్డును కలిగి ఉందని భారత్ బయోటెక్ వెల్లడించింది.

ఇటీవల తమ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆస్ట్రాజెనికా అంగీకరించింది థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అనే దుష్బ్రభావానికి కారణమవుతుందని ఒప్పుకుంది. థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్స్ కౌంట్‌కి కారణమవుతుంది. దీనిపై ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ఈ ప్రకటనను విడుదల చేసింది.

Exit mobile version