NTV Telugu Site icon

Congress: హర్యానా కాంగ్రెస్‌లో లుకలుకలు.. ఓటమి సమీక్షకి సెల్జా, సూర్జేవాలకు అందని ఆహ్వానం..

Congress,

Congress,

Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. హర్యానాలో ఈసారి అధికారం కాంగ్రెస్‌దే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి., అయితే తీరా ఫలితాలు చూస్తే, బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 37 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అతివిశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ విభేదాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. హరాన్యా ఓటమిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ఎమ్మెల్యేలు భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వా వంటి కాంగ్రెస్ నేతలకు హజరయ్యారు. అయితే, ఈ సమావేశాలకు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కుమారి సెల్జాకు ఆహ్వానాలు అందలేదు.

Read Also: Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..

హర్యానా ఓటమి ప్రధాన ఎజెండాగానే సమావేశం జరుగుతుంది. ఈవీఎంలు, అంతర్గత విభేదాలు ఓటమికి కారణాలా..? అనే అంశాలను కూడా సమావేశంలో చర్చించారు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఓటమి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కూడా ప్రధాన చర్చ నడిచినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

ముఖ్యంగా హర్యానాలో కీలక నేతలైన భూపిందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. పలు సమావేశాల్లో ఈ విషయం బయటపడింది. వీరిద్దరి మధ్య కొన్ని నెలులుగా మాటలు లేవు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సమావేశంలో వేదికపైనే మహిళా కాంగ్రెస్ నేతని లైంగికంగా వేధించడాన్ని సెల్జా ప్రశ్నించారు. షెల్జాకి మద్దతుదారుగా ఉన్న వ్యక్తిని ఓడించేందుకు హుడాలు ఇండిపెండెంట్ వ్యక్తిని బరిలోకి దించినట్లు వార్తలు వచ్చాయి.

Show comments