Site icon NTV Telugu

INDIA bloc: “ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు..

Nitish Kumar

Nitish Kumar

INDIA bloc: జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సమోసాలు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. ఢిల్లీ వేదికగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. అయితే ఇంతకముందు కూటమి సమావేశాల్లో టీ, సమోసాలు ఉండేవని, అయితే నాలుగో సమావేశంలో మాత్రం టీ, బిస్కట్లకే పరిమితమైందని పింటూ అన్నారు.

Read Also: Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక పతనానికి కారణం భారత్ కాదు, మనమే.. మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు..

‘‘నిన్నటి సమావేశంలో అనేక పార్టీల పెద్ద నాయకులు ఇండియా కూటమి సమావేశానికి వచ్చారు. అయితే దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. నిన్నటి సమావేశం టీ బిస్కెట్లకే పరిమితమైంది. ఎందుకంటే తమకు నిధుల కొరత ఉందని, రూ. 138, రూ. 1380, లేదా 13,800 విరాళాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఇటీవల కోరింది. విరాళాలు ఇంకా రాలేదు. కాబట్టి నిన్నటి సమావేశంలో సమోసా లేకుండా కేవలం టీ, బిస్కెట్లతోనే ముగించింది. ఎటువంటి సమస్యపై ఎలాంటి చర్చ లేకుండా ముగిసింది’’ అని సునీల్ కుమార్ పింటు చెప్పారు.

ప్రతిపక్షాలు ఇండియా కూటమి నాల్గో సమావేశం అసంపూర్తిగా మిగిలిపోయిందని అన్నారు. జేడీయూ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందించారు. ‘‘ ఇండియా కూటమి సమావేశంలో సమోసా లేకపోవడంతో నితీష్ కుమార్ ఎంపీలు నిరాశకు గురయ్యారు. ఎలాంటి తీవ్రమైన అంశం చర్చకురాలేదని చెప్పారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ని ప్రకటించే వారు ఇలాంటి ఫిర్యాదులు కొనసాగుతూనే ఉంటాయి’’ అని అన్నారు.

Exit mobile version