PM-KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర పెంచుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) కింద లబ్ధిదారులకు ప్రస్తుతం ఏడాదికి రూ.6000 ఇస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ కు తెలియజేసింది.
Read Also: Rahul GandhI: మోదీ, అదానీ బంధం ఇప్పటిది కాదు.. చాలా పాతది..
పీఎం కిసాన్ ఫిబ్రవరి 2019లో ప్రారంభం అయింది, కానీ డిసెంబర్ 2018 నుంచే అమలులోకి వచ్చింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతీ నాలుగు నెలలకు రూ. 2000 చొప్పున మూడు విడతల్లో ఏడాదికి రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ డబ్బులను నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందా..? అని అడిగినప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏం లేదని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాది జనవరి 30 నాటికి, వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు గృహ అవసరాలకు సంబంధించి ఖర్చులను సంబంధించి వివిధ వాయిదాల ద్వారా అర్హులైన రైతులకు రూ. 2.24 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిటన్లు ఆయన వెల్లడించారు. పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 100 శాతం కేంద్ర నిధులతో అమలు అవుతున్న పథకం.
