ఓ ముఖ్యమంత్రి.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తారు.. అయితే, పంజాబ్‌లో రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. పీసీసీ చీఫ్‌గా ఉన్న నవజ్యోత్ సింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చన్నీ.. ఓవైపు సీఎం, పీసీసీ చీఫ్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. పోటీపోటీ ర్యాలీలు, సభలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. అయితే, ఇవాళ ఓ ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చన్నీ.. ఆసక్తికర సమాధానం చెప్పారు..
త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం.. పంజాబ్ సీఎం అభ్యర్థిగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరుని యోచిస్తుందా? అంటూ ప్రశ్న ఎదురు కాగా.. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడిని, అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిని గౌరవిస్తానంటూ బదులిచ్చారు సీఎం చన్నీ.. ఇక, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని చెప్పుకొచ్చిన ఆయన.. దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఆప్ కూడా సత్తా చాటుతాం అంటోంది.. ఇక, అమరీందర్ సింగ్ తమను గట్టు ఎక్కిస్తాడని భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకుంది.. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.