NTV Telugu Site icon

No Pension: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఇకపై పెన్షన్ కట్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం

Himachalassemblypasses

Himachalassemblypasses

హిమాచల్‌ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు.

రాజ్యసభ ఎన్నికల సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి సునాయసంగా గెలుపొందాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాజ్యసభ సీటును కోల్పోవల్సి వచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్.. బుధవారం అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భవిష్యత్‌లో పింఛన్ ఇవ్వకూడదని బిల్లు ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. బిల్లు ఆమోదంతో ఇకపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ అందదు.