NTV Telugu Site icon

No Parking Space- No Car: పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు.. మహారాష్ట్ర సర్కార్ కొత్త రూల్..

Maharastra

Maharastra

No Parking Space- No Car: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఇకపై పార్కింగ్‌ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే రూల్ అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

Read Also: Khammam: యువకుడి అనుమానాస్పద మృతి.. చివరి వాయిస్ మెసేజ్ విని షాక్

ఇక, మహారాష్ట్రలో గల పలు నగరాల్లోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో తమ కార్లను రోడ్ల మీదనే పార్క్‌ చేస్తున్నారు. దీంతో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది అని మంత్రి ప్రతాప్ సర్నాయక్. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు.. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వెహికిల్స్ అందించే అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో.. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉందని మంత్రి అన్నారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పడం లేదు.. దానికి అనుగుణంగా తగిన పార్కింగ్‌ ప్లేస్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సర్నాయక్ వెల్లడించారు.

Read Also: Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ

అయితే, నగరాల్లో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు, ప్రజలు ప్రైవేటు వెహికిల్స్ పై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకుబోతున్నామని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రో పాలిటన్ రీజియన్లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

Show comments